అతని వల్లే.. కోహ్లీ సెంచరీ చేయగలిగాడు : గంభీర్

praveen
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో సాధించిన సెంచరీ గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఏకంగా పుట్టినరోజు నాడు హోమ్ గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ ఇలా సూపర్ సెంచరీతో చెలరేగిపోవడంతో అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి. 119 బంతుల్లో ఇలా సెంచరీ మార్కును అందుకున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా ఈ 100 పరుగుల గురించి చర్చించుకుంటూ ఉండటం గమనార్హం.

 ఫార్మాట్ ఏదైనా సరే విరాట్ కోహ్లీకి తిరుగు లేదని.. అతను గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ ది టైం అంటూ ఎంతోమంది మాజీ ప్లేయర్లు కూడా విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కోహ్లీ సెంచరీ గురించి స్పందించిన భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఒత్తిడిని దూరం చేయడం వల్లే కోహ్లీ సెంచరీ సాధించగలిగాడు అంటూ గౌతమ్ గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రోహిత్ గిల్ అవుట్ అయిన తర్వాత కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు.

 కాగా శ్రేయస్ 77 బంతులో 87 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అయ్యర్ వేగంగా బ్యాటింగ్ చేయడం, కోహ్లీ నుంచి ఒత్తిడిని తొలగించకపోతే.. కోహ్లీ ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడ లేకపోయేవాడు. నేను కోహ్లీ కంటే ఎక్కువగా అయ్యర్ నే  ప్రశంసిస్తాను. ఎందుకంటే ఎవరైనా విరాట్ కోహ్లీ నుంచి ఒత్తిడిని తీశారు అంటే అది శ్రేయస్ అయ్యర్ మాత్రమే. కోహ్లీకి సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడే అవకాశం అయ్యర్ వల్లే లభించింది. ఆ దశలో శ్రేయస్ చాలా డాడ్ బాల్స్ ఆడి ఉంటే.. విరాట్ కోహ్లీపై ఒత్తిడి ఎక్కువై బ్యాట్ షాట్లు కొట్టి అవుట్ అయ్యేవాడు అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: