
బర్త్ డే రోజు.. కోహ్లీ ఫ్యాన్స్ కావాలనుకుంటున్న గిఫ్ట్ అదేనట?
ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్లో డక్ అవుట్ మినహా మిగతా అన్ని మ్యాచ్లలో కూడా అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెంచరీలు కూడా సాధిస్తూ ఎన్నో రికార్డులను తిరగరాసేస్తూ ఉన్నాడు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అయితే ఇక ఇప్పుడు భారత అభిమానులు అందరూ కూడా విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదేంటి మొన్నే కదా సెంచరీ చేసింది.. అంతలా ఆత్రుతగా ఎదురు చూడాల్సిన పని ఏముంది అంటారా. విరాట్ కోహ్లీ పుట్టినరోజు నాడే టీమిండియా వరల్డ్ కప్ లో భాగంగా మ్యాచ్ ఆడుతూ ఉండడంలో.. నవంబర్ 5వ తేదీన సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా.
ఇక అదే రోజు విరాట్ కోహ్లీ పుట్టినరోజు కూడా కావడంతో ఫాన్స్ అందరు కూడా కోహ్లీ పుట్టినరోజు నాడు సెంచరీ చేయాలని కోరుకుంటున్నారు. అయితే కేవలం భారత్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదండి.. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ సైతం పుట్టినరోజు నాడు కింగ్ కోహ్లీ సెంచరీ చేయాలని ఆకాంక్షించాడు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. విరాట్ కోహ్లీ హోమ్ గ్రౌండ్ అయిన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అటు కోహ్లీ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్లాన్ చేసింది. మరి కోహ్లీ అభిమానుల కోరిక తీర్చి సెంచరీ చేస్తాడో లేదో చూడాలి మరి.