వరల్డ్ కప్ హిస్టరీలో.. శ్రీలంక అత్యంత చెత్త రికార్డు?
అయితే ఇలా ఈ వరల్డ్ కప్ లో హిస్టరీలో నిలిచిపోయే విజయాలను సాధిస్తూ సంచలనాలు సృష్టిస్తున్న టీం ఏదైనా ఉంది అంటే అది ఆఫ్గనిస్తాన్ టీమ్ అని చెప్పాలి. అసోసియేట్ టీమ్‌గా క్వాలిఫైర్ మ్యాచ్‌లో వరల్డ్ కప్పులో అధికారిక మ్యాచ్‌లో ఆడెందుకు అర్హత సాధించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మహా మహా జట్లను సైతం అలవోకగా ఓడిస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే ఇంగ్లాండు, పాకిస్తాన్ లాంటి జట్లను చిత్తుగా ఓడించి చరిత్ర సృష్టించిన ఆఫ్గనిస్తాన్.. ఇటీవల శ్రీలంక జట్టుపై కూడా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అయితే ఈ వరల్డ్ కప్ లో వరస పరాజయాలతో సతమతమవుతున్న శ్రీలంక జట్టు.. ఇప్పటికే సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయే పరిస్థితిలో ఉంది. ఇకపోతే ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయిన శ్రీలంక ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో 43 మ్యాచ్‌లలో ఓడిపోయింది. శ్రీలంక ఆ తర్వాత జింబాబ్వే 42, ఇంగ్లాండ్ 37, పాకిస్తాన్ 36, న్యూజిలాండ్ 35, వెస్టిండీస్ 35, బంగ్లాదేశ్ 30 పరాజయాలతో ఈ లిస్టులో తర్వాత స్థానాలలో కొనసాగుతున్నాయి అని చెప్పాలి.