బ్యాచిలర్స్ కి.. ధోని అదిరిపోయే సలహా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా కొన  సాగుతున్నాడు బుమ్రా. అయితే అంతర్జాతీయ క్రికెట్కు 2019లో అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ప్లేయర్లుగా ఉన్న వారి కంటే ధోనికే సోషల్ మీడియాలో ఎక్కువగా క్రేజ్ ఉంది. అయితే అందరిలాగా ధోని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడు. తన పని ఏంటో తాను చేసుకుంటాడు.


 ఇక తన విషయాల గురించి పెద్దగా అప్డేట్లు కూడా ఇవ్వడు. అయినప్పటికీ ధోనీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. ఇక ధోని ఏదైనా మాట్లాడాడు అంటే చాలు దాని గురించి అందరూ చర్చించుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు ఇక ఇటీవల ఏకంగా బ్యాచిలర్స్ కి మహేంద్రసింగ్ ధోని ఒక సలహా కూడా ఇచ్చేశాడు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.



 రిలేషన్షిప్ విషయంలో బ్యాచిలర్స్ కి ధోని సలహా ఇచ్చాడు. మీరు ఎవరితోనైనా సంతోషంగా ఉన్నారా అంటే ఇక వారిని పెళ్లి చేసుకోండి.. అలాగే గర్ల్ ఫ్రెండ్ ఉన్న బ్యాచిలర్స్ కి ఉండే ఒక దురాభిప్రాయంపై క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా.. నా గర్లు ఫ్రెండ్ ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకం అని ఎప్పుడూ అనుకోవద్దు అంటూ ధోని ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొని కామెంట్ చేశాడు. దీంతో ధోని వ్యాఖ్యలతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు అని చెప్పాలి. అలాగే జీవిత భాగస్వామి మన బలానికి మూలం అంటూ వారి విలువలను కూడా వివరించాడు మహేంద్ర సింగ్ ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: