ఐపీఎల్ లో ఆడటంపై.. పండగ లాంటి న్యూస్ చెప్పిన ధోని?
ఒకరకంగా చెప్పాలంటే భారత క్రికెట్ అనే ఒక పుస్తకంలో ధోనీ కోసమే ప్రత్యేకంగా కొన్ని పేజీలు ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనూ ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ ని టీం ఇండియాకు అందించిన ఘనత కూడా ధోనీకి దక్కుతుంది. మహా మహా క్రికెటర్లు సైతం ఒక్కసారైనా ధోని కెప్టెన్సీ లో ఆడితే చాలు అని అనుకుంటారు అంటే ఇక సారథిగా అతను ఎంత గొప్ప విజయాలను సాధించాడు అర్థం చేసుకోవచ్చు. అయితే అంతర్జాతీయ క్రికెట్కు 2019లో వీడుకోలు పలికిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.
అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో ఇక 2024 ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులందరికీ కూడా పండగ లాంటి న్యూస్ చెప్పాడు ధోని. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ధోని క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అని వ్యాఖ్యాత ప్రసంగించిగా.. నేను అంతర్జాతీయ క్రికెట్కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించాను. ఐపీఎల్ కు కాదు అంటూ ధోని సమాధానం ఇచ్చాడు. దీంతో వచ్చే ఐపిఎల్ లో కూడా ధోని ఆడతాడని ఇండైరెక్టుగా చెప్పేసాడు.