వరల్డ్ కప్ హిస్టరీ లోనే.. అతిపెద్ద విజయం ఇదే?

praveen
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది. ఏకంగా పరుగుల ప్రవాహం కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఈ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ వెళ్ళబోయే నాలుగు టీమ్స్ ఏవి అనే విషయంపై ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేని విధంగా మారిపోయింది. ఎందుకంటే మొన్నటి వరకు వరుస ఓటమిలతో సతమతమైన జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టడం కష్టమే అని అందరూ భావించారు. కానీ వరుసగా భారీ తేడాలతో విజయం సాధిస్తూ రన్ రేట్లు మెరుగుపరుచుకుంటూనే పాయింట్లు పట్టికలో తమ స్థానాన్ని అంతకంతకు మెరుగుపరుచుకుంటున్నాయి కొన్ని టీమ్స్.


 ఈ క్రమంలోనే ఇక ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ఒక మ్యాచ్లో కూడా ఇలాగే పరుగుల వరద పారింది. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది అని చెప్పాలి. ఏకంగా 399 పరుగులు చేసి పసికూన నెదర్లాండ్స్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. అయితే ఇక కొండంత లక్ష్యాన్ని చేదించడంలో మాత్రం నెదర్లాండ్స్ తడబడింది. దీంతో 90 పరుగులకే చాప చుట్టేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో 309 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇది భారీ పరుగుల తేడాతో విజయం సాధించిన రికార్డు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే గతంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును ఇక ఇప్పుడు ఆస్ట్రేలియానే బద్దలు కొట్టింది. గతంలో 2015లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 275 పరుగుల తేడాతో విజయం సాధించగా.. ఇదే వరల్డ్ కప్ హిస్టరీలో భారీ విజయంగా కొనసాగింది. ఇక ఇప్పుడు 2023 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై 309 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఆ జట్టు రికార్డును ఆ జట్టే బద్దలు కొట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఐదు మ్యాచ్లలో మూడు విజయాలు సాధించి ఆరు పాయింట్లతో నాలుగవ స్థానానికి చేరుకుంది ఆస్ట్రేలియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: