హీరోయిన్ కి బలవంతంగా ముద్దుపెట్టిన అభిమాని.. వీడియో వైరల్..!

Divya
మలయాళ స్టార్ హీరో మంజు వారియర్ కు తాజాగా చేదు అనుభవం ఎదురయ్యింది. కేరళలోని పాలక్కాడ్ ప్రాంతంలో ఒక ఈవెంట్ కి హాజరైన ఈ హీరోయిన్ అక్కడ ఉండే ఒక మహిళ అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకుంది. అయితే ఇదంతా అక్కడ సడన్గా జరగడంతో హీరోయిన్ తో పాటు అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఈవెంట్ లో యాంకర్ కూడా సదురు అభిమానిని గట్టిగా మందలించినట్లు కనిపిస్తోంది. మన దగ్గరికి వచ్చిన సినిమా సెలబ్రిటీలతో ఇలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు అంటూ హెచ్చరించింది.


అయితే ఆ సదురు మహిళా మాత్రం తను చేసిన పనిని సమర్థించుకొని నాకు మంజు అక్క అంటే చాలా ఇష్టమని ,అందుకే ఆమెను ముద్దు పెట్టుకున్నానంటూ సమాధానం ఇచ్చింది. కానీ ఇంతటి జరుగుతున్నప్పటికీ మంజు వారియర్ మాత్రం ఏ మాత్రం కోపం పడకుండా జరిగిన తర్వాత ఎంత ఓపికగా సహనంతో మిగతా అభిమానులతో కూడా చాలా సరదాగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మంజు వారియర్ కెరియర్ విషయానికి వస్తే ఈమె ఎన్నో చిత్రాలలో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించింది.



మంజు వారియర్ కేవలం నటిగానే కాకుండా, డాన్సర్ గా, ప్రొడ్యూసర్ గా, రైటర్ గా మలయాళ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించింది. ఈమె ఎన్నో డబ్బింగ్ చిత్రాలతో కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంజు వారియర్ నటించిన తెగింపు, అసురన్, L2 తదితర చిత్రాలలో నటించింది. అంతేకాకుండా ఏమైనాటించిన కన్నెళుతి అనే చిత్రానికి ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. అంతేకాకుండా మంజు సల్లాపం అనే పుస్తకం రాసి తనలో ఉండే రచయిత్రిని కూడా బయటపెట్టింది. ఇలా అన్నిట్లో కూడా తన పాపులారిటీ సంపాదించుకుంది మంజు వారియర్. ప్రస్తుతం ఇమే పలు సినిమాలలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: