న్యూజిలాండ్ తో మ్యాచ్.. భారత్ ను భయపెడుతున్న పాత రికార్డులు?

praveen
ప్రస్తుతం ప్రపంచకప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉండగా.. నేడు ఒక రసవతరమైన పోరుకు సర్వం సిద్ధమైంది అని చెప్పాలి. 2023 వరల్డ్ కప్ ఎడిషన్ లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్లుగా రెండు టీమ్స్ దూసుకుపోతున్నాయ్. అందులో సొంత గడ్డపై ప్రపంచకప్ టోర్ని ఆడుతున్న టీమ్ ఇండియా అయితే అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు కూడా ఉంది అని చెప్పాలి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడాయి  ఈ నాలుగింటిలో కూడా ప్రత్యర్థులపై పైచేయి సాధించి విజయ డంకా మోగించాయి.

 ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో ఈ రెండు టీమ్స్ కూడా టాప్ 2 లో ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా ఓటమి ఎరుగని జట్లుగా కొనసాగుతున్న ఈ రెండు టీమ్స్ కి మధ్య ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఈ రెండు టీమ్స్ లో ఏదో ఒక టీం కి విజయాల పరంపరకు బ్రేక్ పడే అవకాశం ఉంది. అయితే సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో టీమ్ ఇండియా అందరికీ ఫేవరెట్ గా ఉంది. కానీ భారత జట్టును గత రికార్డులు మాత్రం భయపెడుతూ ఉన్నాయి అని చెప్పాలి. టీమ్ ఇండియాకు, న్యూజిలాండ్ పై ఏమాత్రం మంచిది రికార్డులు లేవు.

 ఇప్పుడు వరకు ఐసీసీ మ్యాచ్లలో న్యూజిలాండ్, టీమ్ ఇండియా జట్లు 13 సార్లు తలబడ్డాయి. అయితే ఇందులో న్యూజిలాండ్ దే పైచేయిగా ఉంది. న్యూజిలాండ్ భారత్ పై ఏకంగా 10 మ్యాచ్ లలో విజయం సాధిస్తే ఇండియా మాత్రం కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే విజయాలను నమోదు చేసింది. చివరిసారిగా 2003లో జరిగిన ఐసీసీ ఈవెంట్లో న్యూజిలాండ్ ను ఓడించింది టీమిండియా. దీంతో నేడు న్యూజిలాండ్, టీమ్ ఇండియా మధ్య జరగబోయే మ్యాచ్ లో ఏం జరగబోతుందో అనే విషయంపై అందరూ టెన్షన్ పడుతున్నారు. అయితే సొంత గడ్డమీద మ్యాచ్ ఆడుతున్న టీమిండియా పటిష్టంగా కనిపిస్తుండడంతో ఇక ఈసారి తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం పెట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: