సన్రైజర్స్ కు ఆడుతున్నప్పుడే.. ఆ విషయం నేర్చుకున్నా : డేవిడ్ వార్నర్

praveen
ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. ఇక ప్రతి మ్యాచ్ కూడా మిస్ చేయకుండా చూడటానికి అటు క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిని కనబరుస్తున్నారు.  ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్లు సెంచరీల మీద సెంచరీలు కొడుతూ అరుదైన రికార్డులు కూడా కొల్లగొడుతున్నారు. అలాంటి ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ కూడా ఒకరు అని చెప్పాలి. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో అదిరిపోయే ప్రదర్శన చేశాడు డేవిడ్ వార్నర్.


సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ప్రపంచంలోనే బెస్ట్ బౌలింగ్ విభాగం అని చెప్పుకునే  పాకిస్తాన్ బౌలర్లతో చెడుగూడు ఆడేశాడు డేవిడ్ వార్నర్. 124 బంతుల్లో 163 పరుగులు చేసే తనకు తిరుగులేదు అని నిరూపించాడు అని చెప్పాలి. అయితే మరో ఓపనర్ మిచెల్ మార్ష్ సైతం ఏకంగా 121 పరుగులతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘనవిజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇలా పాకిస్తాన్తో మ్యాచ్లో సెంచరీ తో కదం తొక్కిన డేవిడ్ వార్నర్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడటమే తనకు ఎంతగానో కలిసి వచ్చింది అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. ఇన్నింగ్స్ లో మనం అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం ఉంటుందని సన్రైజర్స్ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఈ క్రమంలోనే బ్యాటింగ్లో ఎంతో సులువుగా గేర్లను మార్చడం అనే విషయాన్ని ఆ జట్టుకు ఆడుతున్నప్పుడు నేర్చుకున్నాను అంటూ డేవిడ్ వార్నర్ వెల్లడించాడు. కాగా ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై 62 పరుగులు తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఇకపోతే గతంలో ఐపీఎల్ లో సన్రైజర్స్ కెప్టెన్ గా ఒకసారి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్ గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత జట్టు అతని వదిలేయడంతో ప్రస్తుతం ఢిల్లీకి ఆడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: