హ్యాట్రిక్ కొట్టిన టీమిండియాకు.. తదుపరి 2 మ్యాచ్లు ఎవరితో తెలుసా?

praveen
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో టీమ్ ఇండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. దాదాపు పుష్కరకాలం తర్వాత భారత జట్టు సొంత గడ్డపై వరల్డ్ కప్ ఆడే అవకాశాలు దక్కించుకుంది. దీంతో ఇక ఎన్నో రోజులుగా భారత జట్టును ఊరిస్తున్న వరల్డ్ కప్ టైటిల్ ను ఈసారి గెలుచుకోవడం ఖాయమని టీమిండియా ఫ్యాన్స్ అందరు కూడా బలంగా నమ్ముతున్నారు. అయితే ప్రస్తుతం భారత జట్టు అన్ని విభాగాల్లో కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ప్రేక్షకులు అందరి అంచనాలకు తగ్గట్టుగానే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు వరకు మూడు మ్యాచ్లు ఆడిన టీమిండియా.. మూడు మ్యాచ్లలో కూడా ప్రత్యర్థి  పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొదట పటిష్టమైన ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో అదరగొట్టిన టీమిండియా.. ఇక ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లోను ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. ఇటీవల చిరకాల ప్రత్యర్థి  పాకిస్తాన్ తోను  నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లోను ఘనవిజయాన్ని అందుకుని హ్యాట్రిక్ కొట్టేసింది టీమిండియా.



 కాగా ఇలా వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టిన టీమిండియా  ఆ తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్లు ఏవి అని తెలుసుకోవడానికి క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం మూడు మ్యాచ్లలో విజయంతో జోరు మీద ఉన్న టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడపడుతుంది. ఈ మ్యాచ్ ఈనెల 19వ తేదీన పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగబోతుంది అని చెప్పాలి. ఈ మ్యాచ్ తర్వాత ఈనెల 22వ తేదీన పటిష్టమైన న్యూజిలాండ్తో రసవత్తరమైన పోరుకు రెడీ అవుతుంది టీమ్ ఇండియా. ధర్మశాల వేదికగా జరిగే ఈ పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: