కుల్దీప్ అరుదైన రికార్డ్.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు?

praveen
ఇటీవల కాలంలో భారత జట్టులో ఉన్న ప్లేయర్స్ లో ఎప్పుడు ఎవరు బాగా రాణిస్తారు అని ఊహించడం చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే ఎన్నో రోజులపాటు ఫామ్ కోల్పోయి ఇక సెలక్టర్ల నుంచి ఉద్వాసనకు గురైన క్రికెటర్లు ఆ తర్వాత అనూహ్యంగా భారత జట్టులో చోటు సంపాదించుకొని అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇలా ప్రస్తుతం భారత జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న వారిలో కుల్దీప్ యాదవ్ కూడా ఒకరు. మొన్నటి వరకు అతను భారత జట్టులో చోటు సంపాదించుకోవడం కోసం ఎంతో కష్టపడ్డాడు.


 తన ఫామ్ ను నిరూపించుకున్నప్పటికీ సెలెక్టర్లు మాత్రం తరచూ అతన్ని పక్కన పెడుతూనే వచ్చారు. కానీ వరల్డ్ కప్ కి ముందు కుల్దీప్ యాదవ్ పై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు అతనికి జట్టులో వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చారు. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్న కులదీప్ యాదవ్ తన ప్రదర్శనలతో ఎప్పుడు అదరగొడుతూనే ఉన్నాడు అని చెప్పాలి. కుల్దీప్ యాదవ్ను జట్టులోకి ఎందుకు తీసుకున్నారు చాహల్ లాంటి బౌలర్ ఉండగా అని విమర్శలు చేసిన అందరి నోర్లను తన ఆట తీరుతోనే మూయిస్తూ ఉన్నాడు ఈ మణికట్టు స్పిన్నర్.


 ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో కూడా భారత జట్టు తరఫున అద్వితీయమైన ప్రదర్శన చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. వన్డేలో అత్యధిక వికెట్లు 157 పడగొట్టిన ఎడమ చేతివాటం మణికట్టు స్పిన్నరుగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హగ్ పేరిట ఉండేది. కాగా ఇటీవల పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: