రచిన్ రవీంద్రకు.. అనంతపురంతో ప్రత్యేక అనుబంధం?

praveen
సాధారణంగా భారత జట్టుకు చెందిన ఆటగాడు ఎవరైనా మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు అంటే చాలు.. అతని గురించి ఇకమన దేశంలో క్రీడాలోకం మొత్తం చర్చించుకోవడం సహజం. ఇక అతను సాధించిన రికార్డులు అతని పుట్టు పూర్వత్రాలు ఏంటి అన్న విషయం తెలుసుకోవడానికి క్రికెట్ లవర్స్ అందరూ కూడా తెగ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఒక న్యూజిలాండ్ క్రికెటర్ కు సంబంధించి చర్చ భారత్లో జరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా అతని గురించి చర్చించుకుంటున్నారు.


 అతని బయోడేటా ఏంటి అతను క్రికెట్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు  ఇలా ఇండియాలో చర్చకు వచ్చిన న్యూజిలాండ్ క్రికెటర్ ఎవరో కాదు రచిన్ రవీంద్ర. వరల్డ్ కప్ జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీ తో కదం తొక్కాడు  ఈ భారత మూలాలు ఉన్న న్యూజిలాండ్ క్రికెటర్. ఈ క్రమంలోనే అతను ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. కాగా ఈ న్యూజిలాండ్ క్రికెటర్ కి ఏపీలోని అనంతపురంతో ప్రత్యేక అనుబంధం ఉంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.


 రచ్చన్ రవీంద్ర 2011 నుంచి 2017 వరకు కూడా అనంతపురంలో క్రికెట్ శిక్షణ తీసుకున్నాడు. ది హరి హాట్ క్రికెట్ క్లబ్ తరఫున అనంతపురంలోని ఆర్టీడీలో ట్రైనింగ్ చేశాడు ఈ న్యూజిలాండ్ క్రికెటర్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ షాబుద్దీన్ దగ్గర క్రికెట్ మెలుకువలు నేర్చుకున్నాడు అని చెప్పాలి. ఆ తర్వాత అతని కుటుంబం న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడటం.. ఇక అతను కూడా అక్కడే క్రికెట్లోకి అరంగేట్రం చేయడం.. ఇక ఇప్పుడు జాతీయ జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడటం జరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: