కోరుకున్నది ఎప్పుడు దక్కదు.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
నేటి నుంచి వరల్డ్ కప్ మహా సంగ్రామం ప్రారంభం  కాబోతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ అక్టోబర్ 14 వ తేదీన ఇదే మైదానంలో జరగబోతుంది. అయితే మొదటిసారి అటు రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా బరిలోకి దిగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా ఉంది.


 రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో భారత జట్టుకు వరల్డ్ కప్ గెలిపించడం ఖాయమని.. భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా గట్టిగానే నమ్ముతున్నారు. తనకు కెప్టెన్సీ దక్కడం గురించి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో కెప్టెన్సీలో తనకంటే సీనియర్లుగా ఉన్న వారి గురించి కూడా మాట్లాడాడు. విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోని తనకంటే ముందు కెప్టెన్సీ పాత్రను పోషించడం న్యాయమే అంటూ అంగీకరించాడు. జట్టుకు కెప్టెన్సీ పొందడానికి అనువైన సమయం 26 ఏళ్ల నుంచి 27 ఏళ్లు అంటూ అభిప్రాయపడ్డాడు రోహిత్ శర్మ. అయితే కోరుకున్నది పొందడం ఎప్పుడూ సాధ్యం కాదు అంటూ చెప్పుకొచ్చాడు.


 నాకంటే ముందు విరాట్ కోహ్లీ, ధోని కెప్టెన్ గా సేవలందించారు. అయితే భారత జట్టులోని మరికొందరు దిగ్గజాలకు మాత్రం ఇక జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ గా ఉండే అవకాశం దక్కలేదు  గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వీరంతా భారత క్రికెట్ లో దిగ్గజాలు. మ్యాచ్ విన్నర్లుగా కూడా నిలిచారు  అయితే ఎప్పుడు కెప్టెన్ గా మాత్రం వ్యవహరించలేదు. నిజానికి  యువరాజ్ ఏదో ఒక దశలో కెప్టెన్ గా ఉండాల్సింది. కానీ అవకాశం మాత్రం దక్కలేదు. అదే జీవితం  ఎప్పుడూ అనుకున్నది కాదు. ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది  అయితే నేను ఇప్పుడు కెప్టెన్సీ అవకాశాన్ని పొందినందుకు నిజంగా కృతజ్ఞుడిని  కెప్టెన్సీ గురించి ఏబిసిడి తెలియనప్పుడు కాకుండా జట్టుకు కెప్టెన్ గా  ఎప్పుడు ఎలా వ్యవహరించాలో తెలిసినప్పుడే అవకాశం వరించింది  కాబట్టి నా విషయంలో ఇదే మంచిది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: