గంభీర్ ఒక యోధుడు.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
భారత క్రికెట్ చరిత్రలో ఉన్న గొప్ప ఆటగాళ్లలో  టీమిండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపనర్ గౌతమ్ గంభీర్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.  మైదానంలో బలిలోకి దిగిన తర్వాత.. ఎంతో అగ్ర సీవ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఏకంగా బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ ఉంటాడు  భారీ పరుగులు చేస్తూ ఎన్నోసార్లు టీమిండియా విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి  టీమిండియా రెండుసార్లు ధోని కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ వరల్డ్ కప్ గెలవడంలో గౌతమ్ గంభీర్ పాత్ర ఎంతో కీలకంగా ఉంది అని చెప్పాలి.


 రెండు వరల్డ్ కప్లలో కూడా కీలకమైన సమయంలో అద్భుతమైన ప్రదర్శనలు చేసి ఇక జట్టును విజయ తీరాలకు చేర్చాడు గౌతం గంభీర్. కొన్ని కొన్ని సార్లు పీకల్లోతూ కష్టాల్లో జట్టు కూరుకుపోయిన సమయంలో తన ఆట తీరుతో జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి. అయితే ఇక తన కోపంతో మాత్రం కాస్త నెగెటివిటీని మూటగట్టుకున్నాడు. దీంతో గౌతమ్ గంభీర్ గురించి పాజిటివ్గా మాట్లాడే వారి కంటే నెగటివ్గా మాట్లాడే వారే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే అతను ఎప్పుడు మిగతా ఆటగాళ్ల అభిమానులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటాడు  అయితే ఇటీవల గౌతమ్ గంభీర్ పై భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.



 గౌతమ్ గంభీర్ ను చాలామంది అపార్థం చేసుకుంటారు  కానీ ఆయన గ్రేటెస్ట్ టీం మ్యాన్ అంటూ ప్రశంసలు కురిపించాడు అశ్విన్. మంచి వ్యక్తి. ముఖంలో ఉద్వేగాలు కనిపించకపోయినా ఒక రకంగా ఆయన యుద్ధం చేస్తాడు. ఆటను ఎంతో గొప్పగా అర్థం చేసుకుంటాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత జట్టుపై ఒత్తిడి పడకుండా గంభీర్ అద్భుతంగా ఆడాడు. 120 - 130 పరుగులు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. జట్టు కోసం నిస్వార్ధంగా ఆడి ఇక విజయాన్ని అందించాడు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: