వరల్డ్ కప్ గెలిచే టీం అదే.. మూడు టోర్నీల్లో అతను చెప్పినట్టే జరిగింది?

praveen
వరల్డ్ కప్ మహాసంగ్రామానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా భారత గడ్డపై అడుగుపెట్టి ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లలో మునిగి తెలుతూ ఉన్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య.. అక్టోబర్ 5వ తేదీన జరగబోయే మ్యాచ్ తో ఇక 2023 వన్డే వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది అని చెప్పాలి  అయితే వరల్డ్ కప్ నేపథ్యంలో  ఈ వరల్డ్ కప్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయం గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు తమ అంచనాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు.

 ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలుస్తుందని కొంతమంది అంటుంటే ఇంగ్లాండ్ ఛాంపియన్గా అవతరిస్తుందని మరి కొంతమంది అంటున్నారు. అయితే భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కావడంతో భారత్కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంకొంతమంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ తప్పక గెలిచి తీరుతుందని ఆ దేశ మాజీలు కూడా అంచనా వేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ప్రముఖ జ్యోతిష్యుడు గ్రీన్ స్టోన్ లోబో వన్డే వరల్డ్ కప్ 2023 విజేత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 2023 వన్డే వరల్డ్ కప్ లో ఏకంగా భారత జట్టు వరల్డ్ కప్ గెలవబోతుంది అంటూ తెలిపాడు. అయితే గతంలో 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని 2015లో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలుస్తుందని.. 2019లో ఇంగ్లాండ్ వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుందని గ్రీన్ స్టోన్ లోబో చెప్పాడు   ఆయన చెప్పింది నిజమైంది. ఇక ఎప్పుడూ 2023 వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ  1986లో పుట్టిన కెప్టెన్ మొర్ఖాన్ వరల్డ్ కప్ గెలిచాడు  1987 లో పుట్టిన కెప్టెన్ ఇప్పుడు ప్రపంచకప్ గెలవబోతున్నాడు అంటూ చెప్పాడు  1987లో పుట్టిన రోహిత్ శర్మదే వరల్డ్ కప్ అంటూ ముందే జోష్యం చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: