పాక్ తో మ్యాచ్ లో.. భారత్ దే విజయం : పాక్ మాజీ

praveen
వన్డే వరల్డ్ కప్ మహా సంగ్రామానికి  సమయం ఆసన్నమవుతుంది. మరికొన్ని రోజుల్లో ఈ ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి  అయితే అక్టోబర్ 5వ తేదీ నుండి వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం అవుతున్నా కానీ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తుంది మాత్రం అక్టోబర్ 14వ తేదీన జరగబోయే మ్యాచ్ కోసమె. ఇంతకీ అక్టోబర్ 14వ తేదీన ఉన్న మ్యాచ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ మ్యాచ్ డేట్ ని బాగా గట్టిగానే గుర్తుపెట్టుకుని ఉంటారు. ఎందుకంటే అది దాయాదుల పోరు. నరాలు తెగ ఉత్కంఠ మధ్య జరిగే సమరం. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేనండి అందరూ ఎదురు చూసే హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ సమరం.

 ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఉత్కంఠ అంతా ఇంతా కాదు. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని నాట్ ని వీక్షించడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో ఉండే ఉత్కంఠను తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ పోరు అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది  మొన్నటికి మొన్న ఆసియా కప్ లో పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయాన్ని సాధించింది అని చెప్పాలి.

 ఇప్పుడు భారత జట్టుపై పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా మరోసారి ఓటమి చవిచూస్తుందా అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వాకర్ యూనిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  పాకిస్తాన్ భారత్ మ్యాచ్లో టీమ్ ఇండియాకి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి అంటూ తెలిపారు. భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్ బలహీనమైన జట్టు. భారత్ తో జరిగే మ్యాచ్ లలో పాకిస్తాన్ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి ఆడితే విజయం సాధించే అవకాశం ఉంటుంది. అయితే భారీ అభిమాన సందోహం మధ్య ఆడబోయే భారత్ పై కూడా ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది అంటూ వకార్ యూనిస్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: