టీమిండియాకు.. అతనే ప్రధాన ఆయుధం : పాక్ మాజీ
అయితే వరల్డ్ కప్ కి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఇక ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు ఈసారి వన్డే వరల్డ్ కప్ లో ఏ టీం ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై పలు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక టీమిండియాలో ఉన్న ఆటగాళ్లలో ఎవరు మంచి ప్రదర్శన చేస్తారు. ఎవరు జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తారు అనే విషయంపై కూడా తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టుకు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యానే ప్రధాన ఆయుధం అంటూ పాకిస్తాన్ మాజీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ లో హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. ప్రపంచ కప్ లో అతడే టీమ్ ఇండియాకు ప్రధాన ఆయుధం. ఈ టోర్నీ టైటిల్ ఫేవరెట్ లలో భారత జట్టు కూడా ఒకటి. వారి స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుంది. ఆసియా కప్ లో భారత బౌలింగ్ విభాగం సత్తా ఏంటో చూశాం. కుల్దీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అంటూ వసీం అక్రమ్ కామెంట్ చేసాడు.