సూపర్ సిరాజ్.. లంకని తగలబెట్టిన భారత బౌలర్లు?

Purushottham Vinay
ఆసియా కప్‌ను ఏడోసారి గెల్చుకునేందుకు టీమిండియా కేవలం అడుగుదూరంలో నిలిచింది. ఆదివారం నాడు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత బౌలర్లు విజృంభించారు.టాస్‌ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన లంకేయులను కేవలం 50 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఆ టీం కేవలం 15.2 ఓవర్లు మాత్రమే ఆడడం గమనార్హం. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్ల పడగొట్టగా, హార్దిక్‌ పాండ్యా మొత్తం 3 వికెట్లతో చెలరేగాడు. జస్‌ప్రీత్ బుమ్రా అయితే ఒక వికెట్‌ తీశాడు. టీమిండియా బౌలర్ల దాటికి కుశాల్‌ మెండిస్‌ (17), దుషన్‌ హేమంత (13) తప్ప మరెవరూ రెండంకెల స్కోరుకు చేరుకోలేకపోయారు. భారత బౌలర్ల విధ్వంసంతో శ్రీలంక జట్టులో సగం మంది అసలు ఖాతా కూడా తెరవలేకపోయారు. ఓపెనర్లు నిస్సాంక (2), కుశాల్‌ ఫెరీరా (0), మెండిస్‌ (17) సమర విక్రమ (0), చరిత అసలంక (0), ధనంజయ డిసిల్వా (4), దసన్‌ శనక (0), వెలెగెదెర (8), మధుషన్‌ (1) ఇంకా పతిరణ (0) ఇలా ఒకరు కూడా క్రీజులో నిలవలేకపోయారు. ఈ శ్రీలంక ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు ఫాస్ట్ బౌలర్లే పడగొట్టడం విశేషం.మొత్తానికి లంకని మన బౌలర్లు తగల బెట్టేశారా.


ఇక టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్‌ని ఎంచుకుంది. అయితే అదెంత పెద్ద తప్పో మొదటి ఓవర్‌లోనే తెలుసొచ్చింది. ఫస్ట్ ఓవర్‌లోనే బుమ్రా, కుశాల్ పెరీరా వికెట్‌ను తీసి భారత్‌ కు శుభారంభం ఇచ్చాడు.ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన మహమ్మద్ సిరాజ్  విధ్వంసమే సృష్టించాడు. ఫస్ట్ ఓవర్‌లో మెయిడిన్‌ వేసిన సిరాజ్‌ తన రెండో ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతికే పాతుమ్ నిస్సాంకను అవుట్ చేశాడు సిరాజ్. ఇక మూడో బంతికి సమవిక్రమను ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. నాలుగో బంతికి అసలంక అవుట్ కాగా, ఇక చివరి బంతికి ధనంజయ్ వికెట్ తీశాడు.ఆ తర్వాతి ఓవర్లో శ్రీలంక కెప్టెన్ షనక వికెట్ పడగొట్టి సిరాజ్ వన్డే క్రికెట్‌లో తొలిసారి ఐదు వికెట్లని తీశాడు. దీంతో భారత్ తరఫున కనీసం 16 బంతుల్లో ఐదు వికెట్లు తీసిన ఘనతని సాధించాడు. సిరాజ్ ఆ వెంటనే ఆరో వికెట్ పడగొట్టాడు అతనితో పాటు హార్దిక్ పాండ్యా కూడా మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక టీంని కేవలం యాభై పరుగులకే పరిమితం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: