పాపం.. సౌత్ ఆఫ్రికా దెబ్బకి.. ఆ స్టార్ బౌలర్ ఖాతాలో చెత్త రికార్డు?

praveen
అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ప్రతి క్రికెటర్ కూడా ఇక ప్రతి మ్యాచ్లో అరుదైన రికార్డులు సృష్టించాలి అనే లక్ష్యం తోనే బరి లోకి దిగుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే బౌలర్ అయితే ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను వనికించి వికెట్లను దక్కించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అదే బ్యాట్స్మెన్లు అయితే ఇక ప్రత్యర్థి బౌలర్లతో చెడుగుడు ఆడేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాలని అనుకుంటూ ఉంటారు.

 ఇలా రికార్డులు సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఇలా మంచి ప్రదర్శన చేయాలి అనే ఆత్రుతలో చివరికి చెత్త రికార్డులు మూటగట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఏకంగా భారీగా పరుగులు సమర్పించి బౌలర్లు లేదా తొందరపడి వికెట్ కోల్పోయి బ్యాట్స్మెన్లు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న ఆడం జంప కూడా ఇలాగే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇటీవలే వన్డే క్రికెట్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా జట్టు ఏకంగా ఆస్ట్రేలియా కలలో కూడా భయపడే రీతిలో విధ్వంసం సృష్టించింది. ఆస్ట్రేలియా బౌలర్ల పై విశ్వరూపం చూపించారు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు. ఏకంగా 50 ఓవర్లలో 416 పరుగులు చేశారు. సౌత్ ఆఫ్రికా జట్టులో స్టార్ బాట్స్మెల్ గా కొనసాగుతున్న క్లాసేన్, మిల్లర్ చెలరేగి ఆడటంతో వారి దాటికి ఆస్ట్రేలియా స్పిన్నర్ జంపా ఒక చెత్త రికార్డును మూట గట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మ్యాచ్ లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన జంపా.. 113 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో వన్డే క్రికెట్ హిస్టరీలో అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్గా చెత్త రికార్డు  మూటగట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: