41 పరుగులతో గెలిచిన టీమిండియా.. పరమ చెత్త రికార్?
మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్తో తలబడింది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత నేపాల్తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన టీమ్ ఇండియా.. అదే జోరుతో మరోసారి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోను విజయం సాధించింది. ఇక ఇటీవల సూపర్ ఫోర్ లో భాగంగా శ్రీలంక పై ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఏకంగా 41 పరుగులు తేడాతో సూపర్ విక్టరీ సాధించింది అయితే ఇంతటి సూపర్ విక్టరీ సాధించిన మ్యాచ్ లోనే టీమ్ ఇండియా ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది అని చెప్పాలి. అదేమిటి 41 పరుగులతో గెలిస్తే చెత్త రికార్డు ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు కదా.
ఇంతకీ టీమ్ ఇండియా సాధించిన చెత్త రికార్డు ఏమిటో తెలుసా.. దాదాపు 49 ఏళ్ల భారత వన్డే క్రికెట్ చరిత్రలో బ్యాట్స్మెన్లు అందరూ కూడా స్పిన్ బౌలింగ్లో అవుటపడమే. ఇలా అవుట్ అవ్వడం ఇదే తొలిసారి అని చెప్పాలి. శ్రీలంక యువ స్పిన్ ఆల్ రౌండర్ అయిన దునిత్ వెళ్ళలాగే ఏకంగా ఐదు వికెట్లు తీశాడు భారత టాపార్టర్ మొత్తం కూడా అతని బౌలింగ్ లోనే కుప్పకూలింది. ఇక మరో బౌలర్ అసలంక నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. ఇక మహిష్ టీక్షణ చివరి వికెట్ తీశాడు. దీంతో టీమ్ ఇండియా బ్యాట్స్మెన్లు అందరూ కూడా స్పిన్నర్ల బౌలింగ్ లోనే అవుట్ అయ్యారు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా 213 పరుగులకే ఆల్ అవుట్ అయితే ఇక శ్రీలంక 178 పరుగులే చేసింది.