మాదే విజయం.. ఎందుకో కారణం కూడా చెప్పేసిన బాబర్?
అందుకే ఎప్పుడూ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన కూడా అటు అప్పటివరకు ఉన్న వ్యూయర్షిప్ రికార్డులు అన్నీ కూడా బద్దలవుతూ ఉంటాయి. అయితే ఆసియా కప్ లో భాగంగా ఒకటికి రెండుసార్లు ఈ దాయాదుల పోరులు చూసే అవకాశం వచ్చింది. సెప్టెంబర్ రెండవ తేదీన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పటికీ ఇండియా ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వర్షం అంతరాయం కలిగించడంతో చివరికి మ్యాచ్ రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అయితే ఇక నేడు మరోసారి ఈ దయాతుల సమరం జరగబోతుంది అని చెప్పాలి.
ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా పై తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పాడు. గత రెండు మూడు నెలల నుంచి శ్రీలంకలో క్రికెట్ ఆడుతున్నాము. ఇక్కడ తొలిత శ్రీలంకతో టెస్టు సిరీస్లో తలపడ్డాము. ఆ తర్వాత జట్టులో చాలామంది ఆటగాళ్లు లంక ప్రీమియర్ లీగ్ లో ఆడారు. అదే విధంగా ఈ టోర్ని నుంచి ప్రారంభానికి ముందే ఇక్కడే ఆఫ్గనిస్తాన్ తో వన్ డే సిరీస్ కూడా ఆడామ్. కాబట్టి లంక పరిస్థితులను మేము బాగా అర్థం చేసుకున్నాం. ఆ అనుభవంతోనే భారత జట్టుపై పై చేయి సాధించి ఎంతో సులభంగా విజయం సాధిస్తాం అంటూ బాబర్ చెప్పుకొచ్చాడు.