అందుకే టి20 కంటే.. వన్డే ఫార్మాట్ అంటే నాకు ఇష్టం : కోహ్లీ
ఈ నేపథ్యంలోనే ఇటీవల స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్ అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. బ్యాట్స్మెన్ సత్తాకు పరీక్షగా నిలుస్తుందని.. బ్యాట్స్మెన్ బరిలోకి దిగాక కంపోజర్ గా ఎంతో ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పుకొచ్చాడు. సవాళ్లను ఇష్టపడే తనకు వన్డే ఫార్మాట్ ఇక తన బ్యాటింగ్ లోని అన్ని అంశాలను పరీక్షించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. అందుకే వన్ డే ఫార్మాట్ అంటే మిగతా ఫార్మాట్ తో పోల్చి చూస్తే కాస్త ఎక్కువ ఇష్టం. ప్లేయర్ టెక్నిక్ కంపోజర్ తో పాటు ఓపికకు ఈ ఫార్మాట్ ఒక పరీక్ష.
వన్డే ఫార్మాట్లో పరిస్థితులకు తగ్గట్టు కాస్త భిన్నమైన దశలో ఆడాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు నిదానంగా ఆడాల్సి ఉంటే.. మరి కొన్ని సార్లు ధనాధాన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ఈ ఫార్మాట్ నాలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీస్తూ ఉంటుంది. ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ గెలవడానికి ప్రస్తుతం భారత ఆటగాళ్లంతా కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే మెగా టోర్నీ అంటే ఆటగాలలో ఒత్తిడి ఉండడం సహజం అంటూ తెలిపాడు. కాగా ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ రెండవ తేదీన పాకిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరగబోతుంది.