వరల్డ్ కప్ గెలవాలని.. నాకంటే ఎక్కువ ఎవరు కోరుకోరు : కోహ్లీ
అయితే ఈ ఏడాది మాత్రం అటు టీమిండియాపై ఉన్న ఆశలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. ఎందుకంటే టీమిండియా తప్పకుండా ఈసారి విషయం విజేతగా నిలుస్తుందని అభిమానులు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. దీనికి కారణం భారత్ వేదికగా వన్ డే వరల్డ్ కప్ జరుగుతూ ఉండడమే. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు భారత జట్టు గెలవాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.
అయితే ఇదే విషయం గురించి అటు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలవాలని అభిమానులు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. కానీ గెలవాలని కోరిక అభిమానుల్లో కంటే ప్లేయర్లలో ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ.. వరల్డ్ కప్ గెలవాలని నా కంటే ఎక్కువ ఎవరు కోరుకోరు. నాకు చాలెంజెస్ అంటే ఇష్టం. ఆ చాలెంజెస్ లో వరల్డ్ కప్ కూడా ఒకటి. చాలెంజ్ని స్వీకరించాలి.. క్లిష్ట పరిస్థితులు ఎదురైతే ఎదుర్కోవాలి అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.