సచిన్ లా.. కోహ్లీ టాలెంటెడ్ ఏమీ కాదు : వసీం జాఫర్
సచిన్ సాధించిన ఎన్నో అరుదైన రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ సచిన్కు సైతం సాధ్యం కానీ ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేశాడు. సెంచరీల విషయంలో కూడా సచిన్కు చేరువలోనే ఉన్నాడు కోహ్లీ. అందుకే అతను నేటితరం లెజెండ్ అని క్రికెట్ విశ్లేషకులు అభివర్ణిస్తారు. కానీ విరాట్ కోహ్లీలో సచిన్ లాగా స్పెషల్ టాలెంట్ ఏమీ లేదు అంటూ భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కేవలం క్రికెట్ మీద మక్కువ పట్టుదలతోనే అతను స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అండర్ 19 ప్రపంచకప్ విజయం అనంతరం టీమిండియాలోకి విరాట్ కోహ్లీ వచ్చినప్పుడు.. అతని బ్యాటింగ్లో ఎన్నో లోపాలు కనిపించాయి. చాలా కష్టపడి బలహీనతలను అధిగమించి రెండు, మూడు ఏళ్ల తర్వాత గొప్ప ఆటగాడిగా మారాడు అంటూ జాఫర్ చెప్పుకొచ్చాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డులను కోహ్లీ అధికమిస్తాడు అంటూ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కానీ సచిన్ కంటే కోహ్లీ మెరుగైన ఆటగాడు అయితే కాదు అంటూ స్పష్టం చేశాడు. అయితే ఈ తరం క్రికెటర్ లో మాత్రం కోహ్లీనే అత్యుత్తమ ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లీ భారత క్రికెట్ జట్టులో ఫిట్నెస్ విప్లవాన్ని తీసుకొచ్చాడు అని గుర్తు చేశాడు వసీం జాఫర్.