నువ్వు పక్షిరాజువా ఏంటీ బ్రో.. ఇలా క్యాచ్ పట్టేసావ్?
పాకిస్థాన్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే మ్యాచులు ఆడుతుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మంగళవారం తోలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో పాక్ ప్లేయర్ షాదాబ్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే తోలి వన్డే మ్యాచ్ హంబన్‌తోటలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో నసీం షా బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్ గాల్లోకి ఎగిరి ఆఫ్ఘన్ సారథి హస్మతుల్లా షాహీది క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసినవారందరు షాక్ అయ్యారు. షాహీది పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షాదాబ్ పక్షిలా గాల్లోకి ఎగురూతూ ఎడమ చేత్తో అందుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఓవర్ నుంచే చేతులెత్తేసింది. ఆఫ్ఘనిస్తాన్ వరుస వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ వికెట్ కూడా పడడంతో ఆఫ్ఘనిస్తాన్ కష్టాల్లో పడింది. ఆ జట్టు 3.3 ఓవర్లలో కేవలం 4 రన్స్ మాత్రమే చేసి కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. 3.3 బంతికి షాదాబ్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఆఫ్ఘన్ సారథి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆఫ్ఘన్ జట్టు కేవలం 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 47.1 ఓవర్లలో 201 రన్స్ చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో షాదాబ్ ఖాన్ పట్టిన క్యాచ్ హైలైట్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.