ఆసియా కప్ లో ఎంపికవ్వడంపై.. తిలక్ వర్మ ఏమన్నాడో తెలుసా?

praveen
తెలుగు తేజం తిలక్ వర్మ భారత క్రికెట్ లో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో అటు భారత క్రికెట్లో యంగ్ ప్లేయర్స్ నుంచి ఎంతల పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో టీం ఇండియాలో చోటు దక్కడమే చాలా కష్టంగా మారిపోయింది. ఎంత మంచి ప్రదర్శన చేసిన.. ఎంతలా సత్తా చాటినప్పటికీ ఎంతో మంది ప్లేయర్లు ఇక టీమ్ ఇండియాలో చోటు కోసం కొన్ని నెలలపాటు నిరీక్షణగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ కొంతమంది ప్లేయర్లకు మాత్రం అదృష్టం తొందరగానే వరిస్తుంది.


 అయితే ఇలా టీమ్ ఇండియాలో చోటు దక్కడమే కష్టం అనుకుంటే.. ఇక జట్టులోకి వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆసియా కప్ లాంటి ఒక పెద్ద టోర్నీలో ఛాన్స్ కొట్టేయడం అంటే ఇక ఎక్కడో రాసిపెట్టి ఉండాలి. ఇక ఇలాంటి అదృష్టాన్ని కలిగి ఉన్నాడు తెలుగు తేజం తిలక్ వర్మ. ఐపీఎల్లో రాణించి సెలెక్టర్ల చూపును ఆకర్షించిన తిలక్ వర్మ భారత జట్టులోకి వచ్చాడు. ఇక ఇండియా తరపున కూడా మంచి ప్రదర్శన చేశాడు. ఇంకేముంది సెలెక్టర్లకు అతనిపై అపారమైన నమ్మకం వచ్చేసింది. దీంతో ఏకంగా మెగా టోర్ని ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో అతనికి చోటు కల్పించారు.


 దీంతో తెలుగు క్రికెటర్ కి ఇంత తక్కువ సమయంలో ఆసియా కప్ లో చోటు దక్కడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆసియా కప్ లో తనను ఎంపిక చేయడంపై తెలుగుదేశం తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. తన చిన్ననాటి కళ నెరవేరింది అంటూ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ రోహిత్.. ఎప్పుడు నాకు చాలా మద్దతుగా నిలిచాడు అన్న విషయాన్ని తెలిపారు. ఇక ఐపీఎల్ సమయంలో రోహిత్ నాతో తరచూ మాట్లాడేవారు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో కూడా నాకు పూర్తిగా స్వేచ్ఛని ఇస్తారు అంటూ చెప్పుకొచ్చాడు తిలక్ వర్మ. ఓకే ఏడాది భారత తరఫున టీ20 లకు వన్డేలకు ఎంపీకు అవ్వడం ఆనందంగా ఉందని వన్డేలలో కూడా సత్తా చాటుతాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: