షాకింగ్ : రిటైర్మెంట్ ప్రకటించిన.. 26 ఏళ్ళ స్టార్ ఆల్ రౌండర్?

praveen
అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన తర్వాత అన్ని ఫార్మాట్లలో దాదాపు దశాబ్ద కాలానికి పైగానే ప్రాతినిధ్యం వహించాలని  ప్రతి ఒక్క క్రికెటర్ కలగంటూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఫిట్నెస్ ని కాపాడుకుంటూ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు రిటైర్మెంట్ ప్రకటించేంతవరకు కూడా ప్లేయర్లందరూ అన్ని ఫార్మట్లలో కొనసాగే వారు. కానీ ఇటీవల కాలంలో స్టార్ ప్లేయర్లు అందరూ ఇలా మూడు ఫార్మాట్ లలో కొనసాగడానికి తెగ ఇబ్బందులు పడిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమకు నచ్చిన ఫార్మాట్లో మాత్రమే ఉంటూ మిగతా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం చేస్తూ ఉన్నారు.


 ఇక కొంతమంది ప్లేయర్లు అయితే కనీసం 30 ఏళ్లు కూడా దాటకముందే ఒక ఏదో ఒక ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించడం చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు శ్రీలంక క్రికెటర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని అందరిని అవాక్కయ్యేలా చేశాడు. అతని వయసు 26 ఏళ్లు మాత్రమే. ఈ వయసులో మూడు ఫార్మట్లలో దుమ్ము లేపాల్సింది పోయి.. అతను ఒక ఫార్మాట్లో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నాడు. ఆల్రౌండర్ గా వరల్డ్ క్రికెట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న వనిందు హాసరంగా ఏకంగా టెస్ట్ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.


 ఇక అతని నిర్ణయంతో ప్రస్తుతం అభిమానులందరూ కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. వన్డే, t20 ఫార్మాట్ లపై ఫోకస్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ వనిందు హాసరంగా చెప్పుకొచ్చాడు. అయితే ఇక అతని రిటైర్మెంట్కు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఆమోదం తెలపడం గమనార్హం. ఇప్పటివరకు 48 వన్డెలలో 67 వికెట్లు 832 పరుగులు.. 58 టీ20లలో 91 వికెట్లు 533 పరుగులు చేయగా కేవలం నాలుగు టెస్ట్ మ్యాచ్లే ఆడాడు హాసరంగ. ఐపీఎల్లో ఆర్సిబి తరఫున ఆడుతున్న ఈ యంగ్ ప్లేయర్.. మరికొన్ని దేశాలకు చెందిన టి20 లీగ్ లలో కూడా వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: