రోహిత్ శర్మ కారు నంబర్లో.. ఇంత సీక్రెట్ దాగి ఉందా?
రోహిత్ శర్మ కొనుగోలు చేసిన ఈ బ్లూ కలర్ కారు ధర రూ.4.18 కోట్ల వరకు ఉంటుంది. ఆ విషయం కాకుండా ఈ కారుకు సంబంధించిన మరో విశేషం ఉంది. అదేంటంటే ఈ కారులోని నంబర్ ప్లేట్లో ఉన్న 'MH 01 EB 0264' అనేది రోహిత్ వరల్డ్ రికార్డుని గుర్తుచేసే ఒక నంబర్. ఇందులో '264' అనే నంబర్ రోహిత్ వన్డేల్లో సాధించిన హైయెస్ట్ స్కోర్. 2014లో శ్రీలంకతో ఆడుతున్నప్పుడు రోహిత్ ఈ రికార్డు నెలకొల్పాడు.
రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకరు. అతను భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్, అతను వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కలిగి ఉన్నాడు. ముందుగా చెప్పుకున్నట్లు ఈ ప్లేయర్ 2014లో రోహిత్ శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 264 పరుగులు చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. రోహిత్ శర్మ తన కారు నంబర్‌ను 264గా ఉంచడం ద్వారా తన రికార్డును సగర్వంగా గుర్తుంచుకుంటున్నాడు.
రోహిత్ శర్మ రికార్డును సాధించిన మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా జరిగింది. అతను ఈ మ్యాచ్‌లో 179 బంతులలో 264 పరుగులు చేశాడు. ఇందులో 33 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ రికార్డును సాధించిన తరువాత, అతను అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకరిగా మారాడు. అభిమానులకు ఆదర్శంగా కూడా నిలుస్తున్నాడు.