టీమ్ ఇండియా జెర్సీపై.. పాకిస్తాన్ పేరు.. నిజమేనా?
అన్ని టీమ్స్ ఆడుతున్నట్లుగా ఈ రెండు టీమ్స్ మధ్య మాత్రం ద్వైపాక్షిక సిరీస్ లు అస్సలు జరగవు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ఇండియా పాకిస్తాన్ జట్లు ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో పలుమార్లు తలపడుతూ ఉండడంతో క్రికెట్ ప్రేక్షకులకు ఇక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఖాయం అనేది తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త కాస్త వైరల్ గా మారిపోయింది. సాధారణంగా పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోతేనే అస్సలు జీర్ణించుకోలేరు టీమిండియా ఫ్యాన్స్. అలాంటిది ఇప్పుడు ఏకంగా భారత జెర్సీపై పాకిస్తాన్ పేరు ఉండబోతుంది అన్న విషయం తెలిసి షాక్ అవుతున్నారు.
భారత జెర్సీ పై పాకిస్తాన్ పేరు ఉండడం ఏంటి అని అనుకుంటున్నారు కదా.. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఆసియా కప్ టోర్నీకి ఈసారి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తూ ఉంది అయితే హోస్ట్ కంట్రీ పేరు ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల జట్ల జెర్సీలపై ముద్రిస్తారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఆసియా కప్ లో పాల్గొనబోతున్న భారత్ అటు పాకిస్తాన్ కు వెళ్లకుండా శ్రీలంకలో మ్యాచ్లో ఆడుతున్నప్పటికీ.. ఇక ఆతిథ్య పాకిస్తాన్ పేరు మాత్రం భారత జెర్సీపై కనిపించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఇలాంటి జెర్సీతోనే ఇండియా బరిలోకి దిగుతుందా లేదా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయ అన్నది హాట్ టాపిక్ గా మారింది.