యువరాజ్ తర్వాత.. నెంబర్ 4 లో ఎవరు సెట్ అవ్వలేదు : రోహిత్

praveen
ఒకప్పుడు ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో టీం ఇండియా ఎంతో పటిష్టంగా ఉండేది. ఎంత పట్టిష్టంగా అంటే టీమిండియాతో మ్యాచ్ అంటే చాలు అటు విద్యార్థులు  అందరూ కూడా భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. టీమిండియా అప్పటిలా పటిష్టంగా కనిపించడం లేదు. దీనికి కారణం మిడిల్ ఆర్డర్ సమస్య. గత కొంతకాలం నుంచి మిడిల్ ఆర్డర్ సమస్య టీం ఇండియాను తీవ్రంగా వేధిస్తుంది. అయితే నాలుగు ఐదు స్థానాలలో ఎంతో మంది బ్యాట్స్మెన్లను ప్రయత్నించినప్పటికీ.. అందరూ విఫలం అవుతూనే వస్తున్నారు అని చెప్పాలి.


 అయితే మొన్నటికి మొన్న ఇద్దరు ఆటగాళ్లు మిడిల్ ఆర్డర్లో చెలరేగిపోవడంతో.. ఇక ఆ సమస్య తీరిపోయిందని అందరూ అనుకున్నారు. అయ్యర్ నాలుగవ స్థానంలో పంత్ ఐదవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి మంచి గణంకాలు నమోదు చేశారు. దీంతో టీమ్ ఇండియాకు మిడిల్ ఆర్డర్ సమస్య తీరిపోయిందని అందరూ భావించారు. కానీ అంతలోనే రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడి దాదాపు సంవత్సరం పాటు ఇక జట్టుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక శ్రేయస్ గాయం బారినపడి టీమిండియా కు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో టీం ఇండియా ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు ఆడబోతుంది. దీంతో అటు 4, 5 స్థానాలలో ఎవరిని బరిలోకి దింపాలి అనేది అటు టీమిండియా సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది.


 ఇదే విషయం గురించి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్లో టీమ్ ఇండియాలో నెంబర్ 4 బ్యాట్స్మెన్ ను సెలెక్ట్ చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నెంబర్ ఫోర్ మాకు సమస్యగానే ఉంది. యువరాజ్ సింగ్ తర్వాత ఎవరు కూడా నెంబర్ ఫోర్ లో వచ్చి స్థిర పడలేదు. శ్రేయస్ అయ్యర్ చాలా కాలం పాటు నెంబర్ ఫోర్ స్థానంలో బ్యాటింగ్ చేసి మంచి గణాంకాలు నమోదు చేశాడు. కానీ ప్రస్తుతం అతను గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు. అందుకే గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా సెలెక్టర్లు నాలుగవ స్థానంలో సరిగ్గా సరిపోయే కొత్త ఆటగాడి కోసం చూస్తున్నారు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: