ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది.. కానీ.. యువరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
ఎందుకంటే ఈ ఏడాది అటు భారత గడ్డపైనే వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే సొంత గడ్డపై భారత్ ఎంత పటిష్టమైన టీం అన్న విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే సొంత గడ్డపై టీమ్ ఇండియాని ఓడించడం అంటే అది ప్రతి టీం కి కూడా సవాలతో కూడుకున్నది. ఇలా స్వదేశీ పరిస్థితిలే టీమ్ ఇండియాకు అనుకూలంగా మారి ఇక వరల్డ్ కప్ గెలిచేలా చేస్తాయని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఎంతోమంది భారత మాజీలు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు.
అయితే ఇటీవల ఇదే విషయం గురించి టీమ్ ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను దేశభక్తుడిని కాబట్టి తప్పకుండా ఇండియా గెలుస్తుందని చెబుతాను. కానీ జట్టులో చాలా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. కీలకమైన ఆటగాళ్లు గాయం బారిన పడి జట్టుకు దూరం కావడం కారణంగా.. జట్టులో మిడిల్ ఆర్డర్ సమస్య తీవ్రంగా ఉంది. ఆ సమస్యను పరిష్కరించుకోకపోతే మాత్రం ఒత్తిడి సమయాల్లో జట్టుకు ఇబ్బందులు తప్పవు అంటూ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు.