ఆ సంబరాలు.. ఆమెకే అంకితం ఇస్తున్నా : తిలక్ వర్మ

praveen
ఇప్పటికే ఐపీఎల్లో ఛాంపియన్ టీం అయినా ముంబై ఇండియన్స్ తరఫున ఆడే అవకాశాన్ని దక్కించుకున్న హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ తన ఆట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. టీమ్ ఇండియాకు ఫ్యూచర్ స్టార్ అతనే అన్న నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించాడు. జట్టులో ఉన్న మిగతా ప్లేయర్లు అందరూ విఫలమవుతున్న వేళ అతను మాత్రం నిలకడైన బ్యాటింగ్తో అదరగొట్టాడు. ఇలాంటి ఆట తీరుతో సెలక్టర్లు చూపును ఆకర్షించి ఇక ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో భారత్ తరఫున టీ20 సిరీస్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.


 అయితే ఇప్పుడు వరకు రెండు టి20 మ్యాచ్లు జరుగగా.. రెండిట్లో కూడా భారత జట్టు ఓడిపోయింది. భారత ఆటగాళ్ళు ఎవరు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం ఘోరంగా  విఫలమైంది. ఇలా అందరూ విఫలమవుతున్న సమయంలో అటు తిలక్ వర్మ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదటి మ్యాచ్ లో 22 బంతుల్లో 39 పరుగులు.. ఇక రెండో మ్యాచ్లో ఏకంగా హాఫ్ సెంచరీ చేసి తన అంతర్జాతీయ కెరియర్ను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు.


 అయితే రెండో టి20 మ్యాచ్ లో హాఫ్ సెంచరీ  పూర్తి చేసిన తర్వాత కాస్త కొత్తగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.  రెండు చేతులు ఆడిస్తూ సంబరాలు చేసుకున్నాడు. అయితే ఆ సంబరాలు రోహిత్ కూతురు సమైరాకు అంకితం అంటూ తిలక్ కర్మ చెప్పుకొచ్చాడు. ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు సెంచరీ లేద అర్థ సెంచరీ సాధించిన ఆమె కోసం సంబరాలు చేసుకుంటూ అని తనకు మాటిచ్చాను అంటూ తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ కెరీర్ ను ఇంత గొప్పగా ప్రారంభించడం వెనక రోహిత్ దే కీలకపాత్ర అంటూ చెప్పుకొచ్చాడు.



 చిన్నప్పటి నుంచి రైనా, రోహిత్ నాకు స్ఫూర్తి. అందుకే రోహిత్తో చాలా సమయం గడుపుతా. నా మొదటి ఐపీఎల్ సీజన్లోనే తిలక్ వర్మ మూడు ఫార్మాట్ల ఆటగాడు అని రోహిత్ చెప్పడం..  నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అంతర్జాతీయ క్రికెట్ అంత సులభం కాదు. మనుగడ సాగించాలంటే నిలకడగా రాణించాల్సిందే. మైదానం బయట లోపల క్రమశిక్షణతో ఉండాలి. ఇదంతా నిరంతర ప్రక్రియగా చేస్తుంటేనే మంచి ఫలితాలు వస్తాయి. క్రీజు లో ఎక్కువ సమయం గడపాలని ద్రావిడ్ చెబుతూ ఉంటారు. ప్రపంచ కప్ నుంచి ఆయన సూచనలను పాటిస్తూనే ఉన్నా అంటూ తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: