అంతర్జాతీయ క్రికెట్కు.. విధ్వంసకర ప్లేయర్ రిటైర్మెంట్?
ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్న ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ అటు అభిమానులందరికీ కూడా ఇలాంటి షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెప్పేసాడు. టి20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్న ఇతగాడు మూడు ఫార్మాట్లకు కూడా ముగింపు పలికాడు అని చెప్పాలి. ఇలా తన 12 ఏళ్ల కెరియర్ ని ముగిస్తున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ప్లేయర్ అటు ఫ్రాంచైజీ క్రికెట్ లో మాత్రం సత్తా చాటాలని భావిస్తున్నాడు.
ఈ క్రమంలోనే దేశీయ లీగ్ లలో మాత్రం కొనసాగుతాను అంటూ స్పష్టం చేశాడు. అయితే గత ఏడాది టి20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో అలెక్స్ సభ్యుడుగా ఉన్నాడు అని చెప్పాలి. ఇక విధ్వంసకర ఆటగాడిగా పేరు పొందిన అలెక్స్ హేల్స్. 2011లో భారత్ పై టి20లోక్కి డెబ్యూ చేశాడు. పొట్టి క్రికెట్లో సంచలన బ్యాటింగ్ తో ఆకట్టుకుని అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కొన్ని రోజులపాటు పొట్టి ఫార్మాట్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కూడా కొనసాగాడు. 2022 t20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ ఫైనల్ కు దూసుకెల్లడంలో కీలకపాత్ర వహించాడు. భారత జట్టుతో జరిగిన సెమీఫైనల్ 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లాండ్ తరఫున 75 టీ20 లు, 70 వన్ డే లు, 11 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు.