గెలిచిన విండిస్ కి..ఓడిన ఇండియాకు.. షాక్ ఇచ్చిన ఐసీసీ?
అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన టి20 సిరీస్ లో వెస్టిండీస్, టీమ్ ఇండియా మధ్య హోరహోరి పోరు జరుగుతుంది. ఇటీవల జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమి చూసింది అన్న విషయం తెలిసిందే. అయితే అప్పటికే వన్డే టెస్ట్ ఫార్మట్ లో ఓడిపోయి నిరాశలో ఉన్న వెస్టిండీస్ కు.. మొదటి మ్యాచ్లో విజయంతో కాస్త ఉపశమనం లభించింది. అయితే ఏకంగా గెలిచిన వెస్టిండీస్ కు ఓడిపోయిన టీమ్ ఇండియాకు కూడా ఊహించిన షాక్ ఇచ్చింది ఐసీసీ. తొలి టి20 మ్యాచ్ లో స్లో ఓవర్ రెడ్ కారణంగా టీమ్ ఇండియాకు ఐదు శాతం వెస్టిండీస్ 10% జరిమన విధించింది ఐసిసి. దీంతో ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులో కోతపడనుంది అని చెప్పాలి.
ఇకపోతే మొదటి టీ20 మ్యాచ్ లో ఓడిపోయిన టీమ్ ఇండియా ఇక రెండో టి20 మ్యాచ్లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తూ ఉంది. కాగా రేపు రెండో టి20 మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. రాత్రి 8 గంటలకు ఈ టి 20 మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే తొలి టి20 మ్యాచ్లో భారత బౌలింగ్ విభాగం పరవాలేదు అనిపించినప్పటికీ అటు బ్యాటింగ్ విభాగం మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో చివరికి టీం ఇండియాకు ఓటమి తప్పలేదు అని చెప్పాలి. మరి రెండో టి20 మ్యాచ్ లో అటు టీమ్ ఇండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.