బాబర్, కోహ్లీలపై.. శ్రీలంక మాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అద్భుత ప్లేయర్గా కొనసాగుతున్న ఆటగాళ్లు ఎవరూ అంటే ఇద్దరు పేరు మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటుంది. ఆ ఇద్దరు ఎవరో కాదు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ జట్టుకు  కెప్టెన్గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ. ఇప్పటికే తాను ఒక లెజెండరీ క్రికెటర్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. ఎంతో మంది దిగ్గజాలు సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా చేదించాడు. మూడు ఫార్మట్లలో  కూడా తనకు తిరుగులేదు అని నిరూపించాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా పరుగుల వరద పారిస్తూ రికార్డులు కొల్లగొడుతూనే ఉన్నాడు విరాట్ కోహ్లీ.


 అయితే ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులను బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకుంటూ అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్. ఈ క్రమంలోనే ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అత్యుత్తమ ఆటగాడుగా నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. దీంతో గత కొంతకాలం నుంచి బాబర్, కోహ్లీలలో ఎవరు అత్యుత్తమ ప్లేయర్ అనే చర్చ సోషల్ మీడియాలో తెర మీదకి వస్తూనే ఉంది. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇదే విషయం గురించి ఇటీవల స్పందించిన శ్రీలంక మాజీ ఫేసర్ చమీందా దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాంను ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్ అంటూ చమిందా దాస్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కూడా బాబర్ అగ్రగామి బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు అంటూ పేర్కొన్నాడు. అదే సమయంలో అటు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి గేమ్ లో భారీ స్కోర్ చేయాలని అంచనాలు బ్యాట్స్మెన్ ఎలా ఒత్తిడికి గురిచేస్తాయో నాకు తెలుసు. విరాట్ కోహ్లీని ఫ్యాన్స్ అతడు ఎప్పుడు ప్రతి మ్యాచ్లో భారీగా పరుగులు చేయాలను కోరుకుంటూ కామెంట్ చేశాడు చమిందాదాస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: