ఆ కోచ్ నన్ను గల్లా పట్టుకొని కొట్టాడు.. సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్?
2003 లో ఇండియన్ టీం హెడ్ కోచ్ జాన్ రైట్. ఆ సంవత్సరం అండర్డాగ్స్ గా వరల్డ్కప్ లోకి అడుగు పెట్టిన టీం ఇండియా ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఈ టైం లో సెహ్వాగ్ మరియు హెడ్ కోచ్ జాన్ రైట్ మధ్య ఒక సంఘటన జరిగిందట. ఈ సంఘటనను వివరిస్తూ, " నేను కెరీర్ మొదట్లో బ్యాట్టింగ్ చేసేటప్పుడు పెద్ద షాట్స్ ఆడటానికి ప్రయత్నించి అవుట్ అవుతూ ఉండేవాడిని. మేము శ్రీ లంకతో ఆడుతున్నాం. టార్గెట్ 203 పరుగులు. అప్పుడు కోచ్ నాదగ్గరకు వచ్చి నువ్వు 40 ఓవర్లు బాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేసిన పర్వాలేదు. కానీ అవుట్ అవ్వొద్దు. నీలాంటి టాలెంటెడ్ బ్యాట్స్మన్ ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్నారు. కానీ నాకు నాకు ఇంగ్లీష్ పెద్దగా రాకపోవడం వలన అయన అన్నది ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు. నేను ఎప్పటిలాగానే బ్యాట్టింగ్ కు వెళ్లి 10 -12 రన్స్ చేసి అవుట్ అయ్యాను. డ్రెసీఇంగ్ రూమ్ కి రాగానే కోచ్ నా కాలర్ పట్టుకొని కుర్చిలోకి విసిరేసాడు. నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే టీం మేనేజర్ రాజీవ్ శుక్ల దగ్గరకు వెళ్లి జరిగినది చెప్పాను. స్వతంత్రం వచ్చిన తరువాత కూడా ఈ తెల్లోళ్ళు మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు అని చాలా కోపంగా అన్నాను. తరువాత టీం మీటింగ్ లో సచిన్ సెహ్వాగ్ కి జాన్ రైట్ కి మధ్య జరిగిన విషయం టీం లోనే ఉండాలి అని చెప్పాడు". అని అన్నారు.
ఇదే సంఘటన ఇప్పుడు జరిగితే సోషల్ మీడియాలో పెద్ద హల్ చల్ ఐపోతుంది అని అన్నారు సెహ్వాగ్. కానీ తరువాత జాన్ తనతో ఎందుకు ఆలా ప్రవర్తించవల్సి వచ్చిందో తనకు అర్థమైందని అన్నారు. అతను క్రికెట్ లో ఎక్కువ కాలం కొనసాగటానికి కారణం ఆయనే అని చెప్పుకొచ్చారు సెహ్వాగ్. ఈ సంఘటనను టీం ఇండియా మాజీ టీం మేనేజర్ అమిత్ మాథుర్ రాసిన "పిచ్ లైఫ్ : మై లైఫ్ ఇండియన్ క్రికెట్ " అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వెల్లడించారు.