లైవ్ మ్యాచ్‌లో పాము ఎంట్రీ.. ఆగిన మ్యాచ్?

praveen
లైవ్ లో జరుగుతన్న ఒక మ్యాచ్ లో పాము ఎంట్రీ ఇవ్వడంతో ప్లేయర్లు షాకయ్యారు. దీంతో కొద్దిసేపు మ్యాచ్ కు అంతరాయం కలిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. గేమ్స్ లో క్రికెట్ కు ఉండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక క్రికెట్ మైదానాల గురించి కూడా చెప్పనక్కర్లేదు. అయితే కొలంబో ఆర్. ప్రేమదాస మైదానంలో పాము రావడం ఒక్కసారిగా అందరిని టెన్షన్ పెట్టింది. లంక ప్రీమియర్ లీగ్ 2వ మ్యాచ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.
కొలంబో ఆర్. ప్రేమదాస మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతింది. ఇక్కడ గాలె టైటాన్స్‌తో దంబుల్లా ఓర్రా జట్లు తలపడ్డాయి.

మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుండగా ఒక్కసారిగా మైదానంలోకి పాము వచ్చింది. మ్యాచ్ 4వ ఓవర్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాము కనిపించడంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది. అయితే పాముని అందరు చూస్తుండిపోయాడు. దగ్గరికి వెళ్ళడానికి సాహసం చేయలేదు. వెంటనే ఫోర్త్ అంపైర్ సాహసం చేసి పాముని బయటికి పంపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పామును మైదనం నుంచి పంపించక ఆట మళ్ళీ ప్రారంభించారు.

ఇక గాలె, దంబుల్లా మధ్య జరిగిన మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలె 5 వికెట్లకు 180 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో దంబుల్లా ఓర్రా జట్టు కూడా 180 పరుగులే చేసింది. గాలె తరపున భానుక రాజపక్సే 48 పరుగులు చేయగా కెప్టెన్ దసున్ షనక 42 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాదు బౌలింగ్ లో కూడా షనక ముగ్గురి వికెట్లని తీసాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్ళింది. అయితే సూపర్ ఓవర్ లో దంబుల్లా కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం భానుక రాజపక్సే రెండు బంతుల్లో 10 పరుగులు చేసి గాలెకు టోర్నీలో తొలి విజయాన్ని అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: