విదేశాల్లో ఐపీఎల్ 2024.. ఎందుకో తెలుసా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రారంభమైంది అంటే చాలు క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కేవలం ఇండియన్ క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఐపీఎల్ ను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు. దీనికి కారణం ఇక తమదేశానికి చెందిన క్రికెటర్లు కూడా ఐపీఎల్లో భాగం అవుతూ ఉంటారని.. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేకంగా ఉన్నవారు ఐపీఎల్లో సహచరులుగా మారిపోయి పోరాడుతూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు.


 అందుకే ఐపీఎల్ పోరు ఎప్పుడు ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఉంటుంది  అయితే మొన్నటి వరకు ఐపీఎల్ టోర్నీ పై కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో భారత్ లో వివిధ వేదికల్లో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను అటు యూఏఈ లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. దీంతో ఎంతో మంది భారత క్రికెట్ ప్రేక్షకులు యూఏఈ కి వెళ్లి నేరుగా మ్యాచ్ వీక్షించలేకపోయారు. అయితే ఇక ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ఇండియాలోనే అన్ని వేదికల్లో కూడా మ్యాచ్లు నిర్వహిస్తూ వస్తుంది భారత క్రికెట్ నియంత్రణ  మండలి. అయితే 2024 ఐపీఎల్ సీజన్ కూడా ఎప్పటి లాగానే అన్ని వేదికలపై జరుగుతూ ఉందని అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ అలా జరిగే ఛాన్స్ లేదు అన్నది తెలుస్తుంది.


 ఎందుకంటే 2024 ఐపీఎల్ సీజన్ ను విదేశాల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదేంటి కరోనా ప్రభావం తగ్గింది కదా మళ్ళీ విదేశాల్లో ఎందుకు అనుకుంటున్నారు కదా.. అయితే ఎన్నికల కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుందట బీసీసీఐ. 2024 లో లోక్సభ ఎన్నికలు మే, జూన్ లో జరిగే అవకాశం ఉండడంతో.. ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్లకు ఆటంకం కలుగుతుంది. దీంతో సగం మ్యాచులను బీసీసీఐ విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 2009, 2014 సంవత్సరాలలో ఎన్నికల కారణంగా కొన్ని మ్యాచ్లను దక్షిణాఫ్రికా సహా యూఏఈ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా అదే ప్లాన్ ను అమలు చేయాలని బీసీసీఐ భావిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: