చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోయినా.. బాబర్ రికార్డు బద్దలు కొట్టిన గిల్?

praveen
టీమిండియా యంగ్ సెన్సేషన్ శుభమన్ గిల్ గత కొంతకాలం నుంచి మంచి ప్రదర్శన చేస్తూ టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక తన ఆట తీరుతో మూడు ఫార్మాట్ ల ప్లేయర్ గా కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు శుభమన్ గిల్.. అయితే ఇలా మొన్నటి వరకు సెంచరీల మీద సెంచరీలు చేసి బ్యాటింగ్ విధ్వంసాన్ని  కొనసాగించిన గిల్.. ఇక ఇటీవల కాలంలో గత కొన్ని రోజుల నుంచి మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయడం లేదు. అయినప్పటికీ అటు రికార్డులు మాత్రం కొల్లగొడుతూనే ఉన్నాడు ఈ క్రికెటర్.


 ఇటీవల వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో 34 పరుగులు చేసిన శుభమన్ గిల్ పరవాలేదు అనిపించాడు అని చెప్పాలి. అయితే ఇక ఇన్నింగ్స్ కారణంగా ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. పాకిస్తాన్ కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ అజాం రికార్డుని గిల్ బద్దలు కొట్టాడు అని చెప్పాలి. 26 ఇన్నింగ్స్ లలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు ఈ టీమిండియా యంగ్ క్రికెటర్   బాబర్ అజం 26 ఇన్నింగ్స్ లలో 1322 పరుగులు చేశాడు అని చెప్పాలి   అయితే వెస్టిండీస్తో జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో  34 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డును బద్దలు కొట్టాడు.


 కాగా తన వన్డే కెరియర్ లో ఇప్పటివరకు 26 మ్యాచులు ఆడిన గిల్ 61 సగటుతో 1352 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. అంతేకాదు ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది అని చెప్పాలి  ఇక వన్డే ఫార్మాట్లో గిల్ అత్యధిక స్కోరు 208 గా ఉంది   కాగా గిల్ బాబర్ తర్వాత 1303 పరుగులతో ఇంగ్లాండ్ ప్లేయర్ జోనథన్ మూడో స్థానంలో 1275 పరుగులతో పాకిస్తాన్ ప్లేయర్ ఫకర్ జమాన్ నాలుగో స్థానంలో  ఉన్నారు అని చెప్పాలి. అయితే గిల్ ఇలాంటి రికార్డు కొట్టాడు కానీ అటు రెండో వన్డే మ్యాచ్లో మాత్రం ఇండియా ఘోర ఓటమిపాలు అయింది అని చెప్పాలి  కోహ్లీ, రోహిత్ లాంటి కీలక ప్లేయర్లు లేకుండా బరిలోకి దిగిన ఇండియా చివరికి చిత్తుగా ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: