ప్రపంచ రికార్డ్ సృష్టించిన.. డేవిడ్ వార్నర్?
అయితే ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించిన డేవిడ్ వార్నర్.. ఇక ఓపెనర్ గా మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఇంగ్లాండుతో జరుగుతున్న ఐదో టెస్ట్ నాలుగు రోజు ఆటలో భాగంగా ఉస్మాన్ ఖవాజాతో తొలి వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే జాక్ హబ్స్, గ్రేమ్స్ స్మిత్, అలెస్టర్ కుక్ పేరుతో ఉన్న ఒక అరుదైన రికార్డును అధిగమించాడు అని చెప్పాలి. ఓపెనర్లు అందరూ కూడా సంయుక్తంగా 24 సార్లు 100 పరుగులు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
ఏకంగా 25 సార్లు 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసి అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇక ఈ జాబితాలో మైకల్ అతర్టన్ 23, వీరేంద్ర సెహ్వాగ్ 23 మూడో స్థానంలో ఉన్నారు. కాగా యాషెష్ సిరీస్ లో నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరుగుతుంది అని చెప్పాలి. మొదటి రెండు మ్యాచ్లలో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత మ్యాచ్లో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయింది. దీంతో మూడో మ్యాచ్లో విజయం అందుకున్న ఇంగ్లాండు టీం నాలుగో మ్యాచ్ ను డ్రా గా ముగించుకుంది. దీంతో ఇక చివరి ఐదో మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.