కోహ్లీతో.. నేనెప్పుడూ అలా అనలేదు : జహీర్ ఖాన్

praveen
భారత క్రికెట్లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఐపిఎల్ ద్వారా, దేశవాళీ క్రికెట్ టోర్నీల ద్వారా కొత్త ఆటగాళ్లు తెరమీదకి వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు టీమిండియాలో చోటు దక్కుతుంది అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న సమయంలో ఇక భారత జాతీయ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ప్లేయర్లు.. కొన్ని కొన్ని సార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే జట్టులోకి కొత్త ప్లేయర్లను ఆహ్వానించి ఇక జట్టులో సీనియర్లుగా కొనసాగుతున్న వారి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వేటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే చాలు కొన్ని కొన్ని సార్లు విమర్శలు కూడా వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటూనే జట్టును ముందుకు నడిపించి అద్భుతమైన విజయాలను అందించాల్సి ఉంటుంది. భారత మాజీ ప్లేయర్ జహీర్ ఖాన్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. విరాట్ కోహ్లీ కారణంగానే జహీర్ ఖాన్ కెరియర్ నాశనం అయిందంటూ వార్తలు తెరమీదికి వచ్చాయి.


 ఇదే విషయం గురించి ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా స్పందించారు. కాగా ఇటీవల ఇక ఇలా వైరల్ గా మారిపోయిన న్యూస్ గురించి మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ స్వయంగా స్పందించారు. కోహ్లీ కారణంగానే తన కెరియర్ ముగించారు అని నేను ఎప్పుడూ విరాట్ తో అనలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే న్యూజిలాండ్ తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో తన బౌలింగ్లో మేకళ్లమ్ ఇచ్చిన క్యాచ్ ను విరాట్ కోహ్లీ జార విడిచాడు. ఇక ఆ తర్వాత మేకళ్లమ్ ఏకంగా త్రిబుల్ సెంచరీ చేశాడు. దీంతో ఆ తర్వాత కొన్ని రోజులపాటు విరాట్ కోహ్లీ తనతో సరిగా మాట్లాడలేకపోయాడు అంటూ జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: