వాళ్లతో మాట్లాడటమే.. నా ఆటలో మార్పు తెచ్చింది?

praveen
ఇటీవల కాలంలో యంగ్ బ్యాటర్లందరూ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుంటూ సూపర్ ప్రదర్శన చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా అటు ఎమర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియా ఏ జట్టు తరఫున ఆడుతున్నారు.  అయితే ఇలా ఎమర్జింగ్ ఆసియా కప్ లో భారత ఏ జట్టు వరుస విజయాలు సాధిస్తూ అదరగొడుతుంది. అయితే మొన్నటికీ మొన్న ఐపీఎల్లో అదరగొట్టిన సాయి సుదర్శన్ ఇక ఇప్పుడు ఎమర్జింగ్ ఆసియా కప్ లో ప్లేయింగ్ ఎలవెన్ లో ఆడుతున్నాడు.


 ఈ క్రమంలోనే తన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే చిరకాల ప్రత్యర్థి  అయిన పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు సాయి సుదర్శన్. అయితే ఇలా పాకిస్తాన్ పై సెంచరీ చేయడంతో అతని పేరు ఇండియా వ్యాప్తంగా మారుమోగిపోయింది అని చెప్పాలి. ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అతని సూపర్ సెంచరీ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఆ తర్వాత జరుగుతున్న మ్యాచ్లో కూడా అతను మంచి ప్రదర్శన చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవల సెంచరీ తో అదరగొట్టి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్.. తన ఫామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసాడు. ఐపీఎల్లో దిగ్గజ  క్రికెటర్లతో మాట్లాడటం వల్లే తన ఆటతీరిలో ఎన్నో మార్పులు తెచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ లు ఎంతో విలువైన సలహాలు ఇచ్చారని.. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అతను రానున్న రోజుల్లో కూడా ఇలాగే రాణిస్తే ఇక త్వరలోనే టీమ్ ఇండియాలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: