ధోని, జడేజా మధ్య విభేదాలపై.. అంబటి రాయుడు ఏమన్నాడంటే?
అయితే రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. చెన్నై జట్టు వరుసగా ఓటములు చవిచూడటం.. ఇక ఆ తర్వాత జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకుని సారధ్య బాధ్యతలను మళ్లీ ధోనీకి అప్పగించడం జరిగింది. ఈ క్రమంలోనే కెప్టెన్సీ విషయంలో ధోనికి, రవీంద్ర జడేజాకు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే 2023 ఐపీఎల్ సీజన్లో రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తప్పుకుంటాడు అంటూ ఎన్నో వార్తలు తెరమీదకి వచ్చాయి.
అయితే ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వీడ్కోలు పలికిన అంబటి రాయుడు ఇక ధోనీ, జడేజా మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అదంతా కేవలం కల్పితం మాత్రమే అంటూ స్పష్టం చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధోనితో.. జడేజా సంతృప్తిగా ఉన్నాడు అని నేను అనుకోను. కానీ ఆ సీజన్లో జడేజా బాధతో ఉండడానికి కారణం ఏమిటంటే జట్టు ప్రదర్శన ఏ మంత్రం బాగా లేకపోవడమే. ఆ ఏడాది మేమంతా స్థాయికి తగ్గట్లు ఆడటంలో విఫలం అయ్యాం. అంతే కాదు ఆ సీజన్ తర్వాత పక్కటెముకలు గాయం కారణంగా జడేజా బ్రేక్ తీసుకున్నాడు. జట్టు వైఫల్యంతో నిరాశలో మునిగిన అతను మానసిక ప్రశాంతత కోసం విరామం తీసుకున్నాడు. అంతే తప్ప ధోనితో అతనికి ఎలాంటి విభేదాలు లేవు అంటూ అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.