రోహిత్ అరుదైన రికార్డ్.. ఇండియన్ క్రికెట్ లో ఒకే ఒక్కడు?
అలాంటి రోహిత్ శర్మ ఎందుకొ మూడు ఫార్మాట్లకు సంబంధించిన కెప్టెన్సీ అందుకున్న తర్వాత మాత్రం వ్యక్తిగత ప్రదర్శన విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో కూడా విఫలమవుతూ ఇక అభిమానులు అందరినీ కూడా నిరాశలో ముంచేస్తూ వచ్చాడు అన్న విషయం తెలిసిందే అలాంటి రోహిత్ శర్మ ఇక ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలు మాత్రం మళ్ళి మునుపటి ఫామ్ ను అందుకున్నాడు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో.. సెంచరీ తో చెలరేగిపోయాడు.
ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా ఏకంగా 80 కి పైగా పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు రోహిత్ శర్మ. ఓపెనర్ గా టీమిండియా తరఫున టెస్టు ఫార్మాట్ లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతే కాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నీలో కూడా 2000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో టాస్ ఓడిన భారత జట్టు మొదట బ్యాటింగ్ దిగింది. కాగా మొదటి రోజు ఆట పూర్తయ్య సమయానికి అటు టీమ్ ఇండియా స్కోర్ 288/4 గా ఉండడం గమనార్హం.