సెంచరీ చేసినా.. రోహిత్ బాధపడ్డాడట తెలుసా?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలం నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. కెప్టెన్ గా రోహిత్ శర్మ పరవాలేదు అనిపిస్తున్నప్పటికీ.. ఇక వ్యక్తిగత ప్రదర్శన విషయంలో మాత్రం వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్ అన్న కారణంతో జట్టు నుంచి తొలగించడం లేదు. కానీ లేకపోతే ఎప్పుడో సెలెక్టర్లు అతని పక్కన పెట్టేవారు అంటూ రోహిత్ శర్మ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

 ఇలా తన ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపించాల్సిన రోహిత్ శర్మ ఇక జట్టుకు భారంగా మారిపోతే.. ఇక కెప్టెన్ గా ఎలా సక్సెస్ అవుతాడు అంటూ విమర్శలు చేశారు. అయితే తనపై వచ్చిన విమర్శలకు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు రోహిత్ శర్మ. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇక మరోవైపు యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి మ్యాచ్ లోనే 171 పరుగులు చేసి అదరహో అనిపించాడు. ఇక ఈ టెస్టులో ఇన్నింగ్స్ సహా 141 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది టీమిండియా.

 అయితే చాలా రోజుల తర్వాత సెంచరీ దక్కితే ఏ ప్లేయర్ అయినా సంతోషంలో మునిగిపోతాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం సెంచరీ చేసిన సంతోషంగా లేనని చెప్పుకొచ్చాడు. పైగా బాధపడ్డాడట. ఆలిక్ బౌలింగ్ లో  విండీస్ కీపర్ జోషువా డా డిసిల్వకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోహిత్. దీనిపై మాట్లాడుతూ.. ఎప్పుడూ అవుటయినా నిరుత్సాహపడటం అనేది సహజం. అయితే బాగా బ్యాటింగ్ చేస్తున్నాను అనుకున్నప్పుడు.. భారీ స్కోర్  చేయడానికి అది సువర్ణ అవకాశం. కానీ అవకాశం కోల్పోయినందుకు చింతించా. నా దృష్టి అంతా తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగడం పైనే ఉంది అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: