నేడే రెండో టెస్ట్ మ్యాచ్.. ఇది భారత్ కి 100వ టెస్ట్?
ఓపినర్లు రోహిత్ శర్మ, యశస్వి జైష్వాల్ లు సూపర్ సెంచరీతో చెలరేగిపోయారు అని చెప్పాలి. ఇకపోతే మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా అదే జోరును రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా కొనసాగించాలని చూస్తుంది. ఈ క్రమంలోనే ఇక రెండో టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తుంది అని చెప్పాలి. కాగా భారత్, వెస్టిండీస్ మధ్య నేటి నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే మొదటి మ్యాచ్ ను మూడు రోజుల్లోనే ముగించి ఘనవిజయాన్ని అందుకున్న టీమిండియా.. రెండో మ్యాచ్ గెలిచి ఆతిథ్య వెస్టిండీస్ ను వైట్ వాష్ చేయాలని భావిస్తుంది అని చెప్పాలి.
అదే సమయంలో మొదటి మ్యాచ్ లో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్న వెస్టిండీస్.. రెండో మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవడమే కాదు ఇక సిరీస్ ను సమం చేయాలని భావిస్తుంది అని చెప్పాలి. కాగా భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇంకో విశేషం ఏమిటంటే నేడు జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ అటు భారత జట్టుకి వెస్టిండీస్ తో 100వ టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తో 132, ఆస్ట్రేలియా తో 107, న్యూజిలాండ్తో 62, పాకిస్తాన్తో 59, శ్రీలంకతో 46, సౌత్ ఆఫ్రికా తో 42, బంగ్లా తో 13, జింబాబ్వేతో 11, ఆఫ్ఘనిస్తాన్ తో ఒకటి టెస్ట్ మ్యాచ్లు ఆడింది టీం ఇండియా.