బంగ్లాదేశ్ క్రికెటర్ రికార్డు.. కోహ్లీకి సాధ్యం కానిది?
ఇలా ఇప్పటివరకు బంగ్లాదేశ్ జట్టు సాధించిన ఎన్నో అరుదైన విజయాలలో అటు షకీబ్ ఆల్ హాసన్ కూడా భాగం అయ్యాడు అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ ఆటగాడు.. ఇక ఇటీవలే మరో అరుదైన రికార్డును సాధించాడు మూడు ఫార్మాట్లలో 5 లేదా అంతకంటే ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఇక భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ సైతం సాధ్యం కానీ రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టి20లో రెండు వికెట్లు తీసి 18 పరుగులు చేసిన నాట్ అవుట్ గా నిలవడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తర్వాత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా అందుకున్నాడు.
కాగా టీ20 ఫార్మాట్లో షేకిబ్ ఆల్ హాసన్ కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు రావడంలలో ఐదు కంటే ఎక్కువ పర్యాయాలు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న తొలి క్రికెటర్ గా రికార్డ్స్ సృష్టించాడు. అయితే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ కి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు అని చెప్పాలి. కాగా కోహ్లీ టెస్టుల్లో మూడుసార్లు వన్డేల్లో 10 సార్లు టి20 లో ఏడుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. సచిన్ టెస్టుల్లో ఐదు సార్లు వన్డేలో 15 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సీరస్ గా నిలిచాడు కాగా షకీలా ఇప్పటివరకు 17 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు