పాక్ vs ఇండియా మ్యాచ్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ఫ్లైట్ టికెట్ ధరలు?
ఆ మ్యాచ్ ఏదో కాదు.. ఎప్పుడు జరిగినా నరాలు తెగే ఉత్కంఠ మధ్య క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన మజాను పంచే పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ అని చెప్పాలి. ఇక వన్డే వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 15వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ కోసం అటు క్రికెట్ ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురుచూస్తోంది అనడంలో సందేహం లేదు. అయితే ఇక ఈ దాయదుల పోరుకు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇస్తూ ఉంది అని చెప్పాలి.
అయితే ఈ దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎంతో మంది క్రికెట్ లవర్స్ ఇక మ్యాచ్ రోజు కోసం ప్లాన్లు వేసుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోని దేశ విదేశాల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ రావడానికి సిద్ధమైపోతున్నారు. ఇలాంటి సమయంలోనే ఇక అహ్మదాబాద్ వెళ్లే ఫ్లైట్ టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి అన్నది తెలుస్తుంది. ఏకంగా ఆరు రేట్లు టికెట్ ధరలు పెరిగాయట. అక్టోబర్ 14న అహ్మదాబాద్ కు వచ్చే ఫ్లైట్ టికెట్ ద్వారా 14 వేల నుంచి 22 వేల వరకు ఉందట. అదే సమయంలో హోటల్ అద్దె ధరలు కూడా పెరిగాయట. ఒక్క రాత్రి నైట్ స్టే కోసం 50వేల రూపాయలు తప్పనిసరిగా పే చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పాలి.