వెస్టిండీస్‌తో మొదటి టెస్టులో ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడం టీమిండియాకు బాగా కలిసివచ్చింది. దీంతో డొమినికా వేదికగా విండ్సర్ పార్క్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ సేన బాగానే పట్టు బిగించింది.ఇక విండీస్‌తో టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ముంబై బ్యాటర్ యశస్వి వ్యక్తిగతంగా పలు రికార్డులు సాధించిన సంగతి తెలిసిందే.కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా వచ్చిన యశస్వి రెండో రోజు ఆట ముగిసే సరికి ఏకంగా 143 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇప్పటి దాకా మొత్తంగా 350 బంతులు ఎదుర్కొన్న అతడు మొత్తం 14 ఫోర్ల సాయంతో ఈ మేరకు స్కోరు చేశాడు. మరోవైపు.. రోహిత్ శర్మ 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు.ఇక ఈ క్రమంలో వీరిద్దరు సెహ్వాగ్- జాఫర్ పేరిట ఉన్న 17 ఏళ్ల రికార్డును ఈజీగా బద్దలు కొట్టారు. కాగా డొమినికా టెస్టులో ఓపెనర్లు రోహిత్- యశస్వి ఏకంగా 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇక వెస్టిండీస్‌పై టెస్టుల్లో భారత ఓపెనింగ్ జోడీకి ఇదే అత్యధిక పార్ట్‌నర్‌షిప్ కావడం విశేషం.
గతంలో 2006 వ సంవత్సరం లో గ్రాస్ ఐస్లెట్ టెస్టు సందర్భంగా నాటి ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్- వసీం జాఫర్ మొత్తం 159 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయగా.. రోహిత్- యశస్వి జోడీ ఇప్పుడు వాళ్లను ఈజీగా అధిగమించింది. ఇక ఈ జాబితాలో సునిల్ గవస్కర్- చేతన్ చౌహాన్ 153, సునిల్ గవస్కర్- అన్షుమన్ గైక్వాడ్ 136 పరుగుల భాగస్వామ్యంతో ఈ జోడీల తర్వాతి స్థానాలలో నిలిచారు. ఇక రోహిత్ శర్మ స్టీవ్ స్మిత్ గొప్ప రికార్డును సమం చేశాడు. టీమిండియా కెప్టెన్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోని మొత్తం మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) తన 44 సెంచరీలను పూర్తి చేశాడు. అందువల్ల అతను అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ 44 సెంచరీల రికార్డును ఈజీగా బద్దలు కొట్టాడు.ఇక రెండో రోజు ఆట ముగిసే సరికి విండీస్ మీద టీం ఇండియా 162 పరుగుల ఆధిక్యంతో ఉంది.