వారెవ్వా.. ఐపీఎల్ హీరోకి గోల్డెన్ చాన్స్?

praveen
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్ లలో కూడా సిరీస్ లో ఆడబోతుంది టీమిండియా. అయితే ఇక మొదట టెస్ట్ సిరీస్ తో ఈ పర్యటనను ప్రారంభించబోతుంది అని చెప్పాలి. కాగా రేపటి నుంచి వెస్టిండీస్, టీమ్ ఇండియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే మొన్నటికి మొన్న ముగిసిన ఐపిఎల్ లో మంచి ప్రదర్శన చేసిన ఎంతో మంది యంగ్ ప్లేయర్లకు అటు భారత జట్టులో చోటు దక్కింది అన్న విషయం తెలిసిందే. ఇక వెస్టిండీస్ తో సిరీస్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యులలో ఎంతోమంది యంగ్ క్రికెటర్ కి కూడా ఛాన్స్ దొరికింది అని చెప్పాలి. అయితే ఇలా ఇప్పటివరకు చాలామంది క్రికెటర్లు టీమిండియాకు ఎంపికయ్యారు. కానీ తుది జట్టులో మాత్రం ఆడే ఛాన్స్ దక్కించుకోలేదు. కానీ రేపు జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం ఐపీఎల్ హీరో టీమ్ ఇండియాలో  లక్కీ ఛాన్స్ కొట్టేశాడు అన్నది తెలుస్తుంది.


ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన యశస్వి జైష్వాల్ ఎంత అద్భుతమైన ప్రదర్శన చేసాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక రకంగా సెంచరీల మోత మోగించాడు. ఈ క్రమంలోనే ఈ యంగ్ ప్లేయర్ కి మొదటి టెస్ట్ మ్యాచ్ లో చోటు దక్కడం పక్క అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఐపిఎల్ లో నిరూపించుకున్న ఈ ప్లేయర్ కి టీమ్ ఇండియాలో తుది జట్టులో చోటు దక్కడం ఖాయం అందరూ అనుకుంటున్నారు.


కాగా తుది జట్టు అంచనా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: